భారత్ కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జిల్లా సహాయ కార్యదర్శిగా రెడ్డిపల్లి అప్పలరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏపీ ఈశ్వరయ్య ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా సమితి కార్యాలయంలో బుధవారం ఈ ఎన్నికలు జరిగాయి. జాతీయ సమితి సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. రెడ్డిపల్లి చేస్తున్న ప్రజా పోరాటాలకు గుర్తింపుగా ఆయనకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.