చోడవరం;సైబర్ నరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు

చోడవరం మండలం గాంధీగ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరంలో రెండో రోజు బుధవారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ శిబిరంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సామాజిక అంశాలపై సర్వే నిర్వహించారు. అనంతరం జరిగిన అవగాహన సదస్సులో చోడవరం సీఐ సర్కిల్ అప్పలరాజు, ఎస్సై కమల్ భార్గవ్ సైబర్ చట్టం, మాదకద్రవ్యాల ప్రభావాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కళాశాల అధ్యాపకులు డా. లక్ష్మీ గంగమ్మ, డాక్టర్ సూర్యవతి, డాక్టర్ సంధ్య శ్రీ తదితరులు ప్రసంగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్