చోడవరం వాసవి మాత ఆలయంలో వేంచేసియున్న ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆషాడ బహుళ తదియ పురస్కరించుకొని ఆదివారం శాఖంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ, వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు పళ్ళు ఆకుకూరలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.