చోడవరంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం నియోజకవర్గ స్థాయి పోటీలు స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ పోటీలను చోడవరం మండల విద్యాశాఖాధికారి కె. సింహాచలం, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామిరెడ్డి ప్రారంభించారు. పాఠశాల మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన అందరికీ అభినందనలు తెలియజేస్తూ, నియోజకవర్గ స్థాయిలో విజేతగా నిలిచిన వారు అమరావతిలో జరిగే నమూనా శాసనసభ సమావేశాలకు హాజరవ్వాలని సూచించారు.