రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయురాలు పి. వి. ఎం నాగజ్యోతి గ్రంథాలయ అభివృద్ధికి 30 పుస్తకాలను విరాళంగా అందించారు. ఈ పుస్తకాలలో పోటీ పరీక్షలకు, కంప్యూటర్ టెక్నాలజీపై అవగాహన కల్పించేవి ఉన్నాయి. ముఖ్యంగా జనరల్ స్టడీస్ పుస్తకాలు పాఠకులకు అమూల్యమైనవని తెలిపారు. గ్రంథాలయ నిర్వాహకులు రాజబాబు, సిఆర్పి సతీష్ నాగజ్యోతి సేవాభావాన్ని, ఉదార స్వభావాన్ని ప్రశంసించారు.