మత్స్యకారులకు ఉపాధి కల్పించాలి

పరవాడ ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో, పరవాడ ఫార్మాసిటీలో ముత్యాలమ్మపాలెం పంచాయతీకి చెందిన మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని గ్రామ మాజీ సర్పంచ్ చింతకాయల సుజాత విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగాలు కల్పించాలని, ఫార్మాసిటీ ఏర్పాటైన తర్వాత మత్స్యకారులకు ఉపాధి కరువైందని ఆమె వివరించారు. ఎమ్మెల్యే సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్