చోడవరంలో గీతా జయంతి వేడుకలు

చోడవరం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో సోమవారం గీతా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూసర్ల సీత, కలగర్ల అనితల ఆధ్వర్యంలో 108 మంది వాసవి మహిళా మండలి మహిళలు గీతా పారాయణం చేశారు. ఆలయ అర్చకులు ఎం. శ్రీకాంత్ పారాయణం అనంతరం మహిళలకు ఆశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్