కళా ఉత్సవ్ 2025: మారేడుమిల్లి గురుకులంలో ఘన ఏర్పాట్లు

మారేడుమిల్లి ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో నవంబర్ 3 నుండి 5 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న కళా ఉత్సవ్ 2025 కు పక్కాగా ఏర్పాట్లు చేయాలని, దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని ఐటీడీఎ ప్రాజెక్ట్ అధికారి స్మరన్ రాజ్ సూచించారు. మారేడుమిల్లిలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు హాజరవుతారని తెలిపారు. ప్రిన్సిపాల్ శంకర ప్రసాద్, అదనపు వైద్యాధికారిని సరిత, ఎంపీడీఓలు రవికిశోర్, బాపన్న దొర, తహసల్దార్ బాలాజీ, యం ఈ ఓ ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్