చోడవరంలో మహా అన్నదానం, భక్తుల విశేష స్పందన

మాఘ పౌర్ణమి సందర్భంగా ఆదివారం చోడవరంలోని స్వయంభు గౌరీశ్వర స్వామి ఆలయంలో కురచా నారాయణమూర్తి వెంకటలక్ష్మి, కుమార్తె జ్యోత్స్నల సహకారంతో మహా అన్నదానం కార్యక్రమం జరిగింది. ఉదయం ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కమిటీ చైర్మన్ గూడూరు సురేష్, ఈవో సత్యనారాయణమూర్తి, ప్రధాన అర్చకులు కొడమంచిలి చలపతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్