సిఐటియు అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి

సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) అఖిలభారత 18వ మహాసభలు విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, మంగళవారం చోడవరం మండలం గవరవరం పిహెచ్‌సి వద్ద ఆశా కార్యకర్తలు గోడపత్రికను ఆవిష్కరించారు. సీఐటీయూ 55 ఏళ్ల చరిత్రలో తొలిసారి విశాఖలో ఈ మహాసభలు జరుగుతున్నాయని, కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభల్లో ఆటో, రవాణా రంగ కార్మికుల, ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలపై తీర్మానాలు చేసి, భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్