రావికమతం మండలంకొత్తకోట గ్రామానికి చెందిన భీమరాతి రమణ(41)విద్యుత్ షాక్ కు గురై శుక్రవారం మృతి చెందాడు. ఇతడు పదేళ్ల క్రితం కూలీపని కోసం గాజువాక వెళ్లారు. కంచర పాలెం ఐటిఐ వద్ద గల కుంచుమాంబ వాటర్ సర్వీసింగ్ సెంటర్లో రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు. శుక్రవారం విధులకువెళ్లిన రమణ సర్వీసింగ్ సెంటర్లో మోటారు స్వీచ్చ్ ఆన్ చేయగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురై సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు బందువులు తెలిపారు.