లయన్స్ క్లబ్ చోడవరం శాఖ నూతన అధ్యక్షుడిగా పసుమర్తి సాంబశివరావు బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం 2025–2026 సంవత్సరానికి లయన్స్ క్లబ్ చోడవరం శాఖ నూతన కార్యవర్గం ఎన్నికయింది. ఈ కార్యవర్గంలో బద్రిమహంతి ఫాల్గుణ కార్యదర్శిగా, పనతల గంగాధర్ మాస్టర్ ఖజాంచిగా ప్రమాణ స్వీకారం చేశారు. చోడవరం మెయిన్ రోడ్డులోని చేకూరి కన్వెన్షన్ హాల్‌లో, ప్రస్తుత అధ్యక్షులు లయన్ డాక్టర్ నీలం నాగేంద్రబాబు అధ్యక్షతన నిర్వహించారు.