రావికమతం మండలం కవ్వగుంట, కొమిర గ్రామాలలో గిరిజనులకు భూమి పట్టాలు వెంటనే ఇప్పించాలని కోరుతూ శుక్రవారం వారు ఆందోళన చేపట్టారు. కవ్వగుంట రెవెన్యూ పరిధిలో 90 ఎకరాలు 30 మంది గిరిజనులు, కొమిరలో 12 మంది గిరిజనులు సాగు చేసుకుంటున్నారని, జగనన్న రీ సర్వే తర్వాత కూడా వారికి పట్టాలు ఇవ్వలేదని ఆరోపించారు. గ్రామంలో ఇతర పేదలు గత 50 ఏళ్లుగా జీడి మామిడి తోటలు, వరి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని, గతంలో వారికి పట్టాలు అందించినా, రీ సర్వే తర్వాత అందాల్సిన పట్టాలు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు.