రావికమతం;రైతులంతా ఈ క్రాప్ నమోదు చేసుకోవాలి.

మత్సవానిపాలెం గ్రామంలో శుక్రవారం కృషి విజ్ఞానకేంద్రం, రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ, పంటలు వేసిన రైతులందరూ ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలని సూచించారు. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు పొలాల్లో నీరు ఎక్కువగా ఉంటే బయటకు పంపేలా చూడాలని, వరిలో ఆకుముడత తెగులు నివారణకు కరోజన్, ప్రొఫైకోనాజోలు పిచికారీ చేయాలని కె.వై.కె. ప్రోగ్రాం కో ఆర్డినేటర్ రాజ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్