రోలుగుంట: 'అధికారుల నిర్ల్యక్ష్యంతోనే అక్రమ మైనింగ్'

రోలుగుంట మండలంలో అధికారుల నిర్లక్ష్యంతోనే అక్రమ మైనింగ్ కొనసాగుతోందని చోడవరం నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్  పీవీఎస్ఎన్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాటంకంగా జరుగుతున్న అక్రమ మైనింగ్ పై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం గుర్తు చేశారు. రాజన్నపేట వద్ద గల చెరువు గర్భంలో రహదారి నిర్మించిన క్వారీ యాజమాన్యంపై సత్వరమే చర్యలు తీసుకోవాలని మరోసారి కలెక్టర్ కు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్