గణితంలో వందకి వంద మార్కులు సాధించిన విద్యార్థి

బుచ్చయ్యపేట మండలంలో పది ఫలితాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మండల కేంద్రంలోని జాజి మొగ్గల ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి గాడి భరణి కుమార్ 600కు 548 మార్కులు సాధించడంతో పాటు గణితంలో 100కు 100 మార్కులు సాధించి అందరి మన్ననలు పొందారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆయనను అభినందించారు. మండలంలో మొదటి, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థుల్లో జాజి మొగ్గల స్కూల్ కు చెందిన పి. సూర్య 600కు 582 మార్కులతో మూడో స్థానం సాధించింది.

సంబంధిత పోస్ట్