ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, విశాఖ డెయిరీ అవినీతి అక్రమాలపై జ్యోతుల నెహ్రు నేతృత్వంలో 2024 నవంబర్లో వేసిన సభా కమిటీ నివేదికను తక్షణమే బహిర్గతం చేసి, అవినీతికి పాల్పడిన విశాఖ డెయిరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, సభా కమిటీ వేసి ఏడాదిన్నర కావస్తున్నా, డెయిరీ యాజమాన్యం ఒత్తిళ్లకు తలొగ్గి నివేదికను బయటపెట్టడం లేదని ఆరోపించారు. సభా కమిటీకే చట్టబద్ధత లేనప్పుడు, ఎవరి మెప్పుకోసం ఈ కమిటీ వేశారని ఆయన ప్రశ్నించారు.