విధి నిర్వహణలో అలసత్వం వద్దు సమయపాలన విధిగా పాటించాలి

అనకాపల్లి డీఈవో జి. అప్పారావు నాయుడు బుధవారం సాయంత్రం చోడవరం మండలంలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 140 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ సమావేశంలో, డీఈవో ఉపాధ్యాయులందరూ సమయపాలన పాటించాలని, ఉదయం 9 గంటలకు హాజరు కావాలని, 9:30 గంటలకు విద్యార్థుల హాజరును లీప్ యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే, గ్యారంటీ ఎఫ్.ఎల్.ఎన్.పై ప్రత్యేక శ్రద్ధ వహించి, 75 రోజుల ప్రణాళికను అనుసరించి ఫిబ్రవరి 15 నాటికి విద్యార్థుల స్థాయిలలో పురోగతి సాధించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్