వర్షాలకు ఆదివాసి రైతుల పంట నష్టం, ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి

రావికమతం రోలుగుంట మండలం పరిధిలోని సోంపురం, నేరేడు బంధ, పిత్రి గడ్డ, నీళ్లు బంద గ్రామాల్లో ఆదివాసి రైతులు సాగు చేసిన 10 ఎకరాల మెట్టు ధాన్యం పంట వర్షాలకు దెబ్బతింది. ధాన్యం మొలకెత్తడం, భూమిలో రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొండ శిఖర గ్రామాల్లో ఫారెస్ట్ పట్టాలు కలిగి ఉన్నామని, తుఫానుతో పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆదివాసి రైతులు కోరుతున్నారు. నాన్ షెడ్యూల్ ఆదివాసి గిరిజనులమని, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్