విశాఖ: సీరియల్‌లో అవకాశం ఇప్పిస్తానని మోసం

టీవీ సీరియల్‌లో అవకాశం ఇప్పిస్తానని ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తెలంగాణకు చెందిన ఓ మహిళను విశాఖకు చెందిన లక్ష్మీ వరప్రసాద్ మోసం చేశాడు. సీరియల్‌లో అవకాశం ఇప్పిస్తానంటూ విడతల వారీగా రూ.60 లక్షలకుపైగా వసూలు చేశాడు. రూ.22.43 లక్షలతో లగ్జరీ కారు కూడా కొనుగోలు చేశారు. మోసపోయినట్లు గుర్తించిన బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్