కల్తీ నెయ్యితో ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసిన వైసిపి

స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు గురువారం విలేకరులతో మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వం 2019-24 మధ్య తిరుమలలో అవినీతి, అధికార దుర్వినియోగం, పరిపాలన వైఫల్యం కారణంగా పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును కలిపిందని ఆరోపించారు. ఇది హిందూ మత విశ్వాసాలను తీవ్రంగా దెబ్బతీసిందని, కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసిందని, తద్వారా స్వామివారి సొమ్మును రూ. 250 కోట్లు దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. ఇది దైవం పేరుతో జరిగిన అవినీతి అని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్