ప్రతి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక”కార్యక్రమంలో జీవీఎంసీ లో అన్ని విభాగాలకు కలిపి 154 వినతులు వచ్చాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జివిఎంసి ప్రధాన కార్యాలయం లోని పాత సమావేశ మందిరం లో కమీషనరు కేతన్ గార్గ్ తో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.