బైక్ అదుపుతప్పి గోడకు ఢీకొని యువకుడి దారుణ మృతి

విశాఖపట్నం: పెందుర్తి మండలం నరవ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సత్తివానిపాలెం నుంచి వస్తున్న యువకుడు తన బైక్‌పై అదుపుతప్పి సమీపంలోని గోడను ఢీకొన్నాడు. ఈ సంఘటనలో మృతి చెందిన యువకుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పెందుర్తి సీఐ సతీష్ కుమార్ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్