17 ఏళ్ల తరవాత ఇంటికి చేరిన యువకుడు

మానసిక స్థితి సరిగా లేకపోవడంతో 17 ఏళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయిన షేక్‌ రఫీక్‌ (25) ఎట్టకేలకు తన ఇంటికి చేరుకున్నాడు. విశాఖపట్నంలో వీధుల్లో తిరుగుతున్న అతన్ని ఏయుటీడీ స్వచ్ఛంద సంస్థ గుర్తించి, నార్‌లోని అశోక్‌వన్‌ పునరావాస కేంద్రానికి తరలించింది. అక్కడ చికిత్స అనంతరం కుటుంబ వివరాలు తెలుసుకున్న సంస్థ ప్రతినిధి రాజేష్‌కుమార్‌ మౌర్య.. శుక్రవారం రఫీక్‌ను తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌లోని తన కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్