విశాఖ ఆర్టీసీ 500 నంబర్ బస్సుపై యువతి సెల్ఫీ వీడియో వైరల్

విశాఖపట్నంలో ఆర్టీసీ 500 నంబర్ బస్సు డ్రైవర్, కండక్టర్ల నిర్లక్ష్యంపై ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. డబ్బులు ఇస్తామని బతిమిలాడినా బస్సులు ఆపడం లేదని, విద్యార్థులు, మహిళలను కూడా పట్టించుకోవడం లేదని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ సెల్ఫీ వీడియో తీసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రయాణికులు, నెటిజన్లు ఆర్టీసీ సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్