విశాఖలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి RTC బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ట్రాఫిక్ ACP శ్రీనివాసరావు తెలిపారు. లారీ పంచర్ కారణంగా రోడ్డు పక్కన ఆగి ఉండగా, అదుపుతప్పి బస్సు దానిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గాజువాక CI షేక్ హుస్సేన్ దర్యాప్తు చేస్తున్నారు.