పేదలకు ఆర్థిక సహాయం అందించడమే సీఎంఆర్‌ఎఫ్ లక్ష్యమని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. అనకాపల్లి, జీవీఎంసీ 84వ వార్డు శిరసపల్లి గ్రామంలో ముగ్గురు బాధితులకు రూ.6 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చినతల్లి నీలబాబు, టీడీపీ నేతలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.