విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వున్న జ్యోతిరావు పూలే విగ్రహానికి ఉపకులపతి ఆచార్య పి. వి. జి. డి. ప్రసాదరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య పి. వి. జి. డి. ప్రసాదరెడ్డి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే చూపిన మార్గం నేటి తరానికి ఆచరణీయమని అన్నారు.