విశాఖపట్నంలో ఎండల తీవ్రత అప్పుడే మొదలైంది. గురువారం ఉదయం నుంచే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాధారణంగా మధ్యాహ్నానికి పెరగాల్సిన ఉష్ణోగ్రతలు, ఉదయం 11 గంటలకే 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. వేడి గాలుల ప్రభావంతో ఎప్పుడూ రద్దీగా ఉండే బీచ్ రోడ్డుతో పాటు ప్రధాన రహదారులన్నీ మధ్యాహ్నం కాకముందే నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూను తలపిస్తున్నాయి.