వాల్తేరు డివిజన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్ సౌకర్యం (క్యాప్సూల్ హోటల్) ప్రారంభమైంది. నాన్-ఫేర్ రెవెన్యూ కింద ఈ వినూత్న సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ స్టేషన్‌లో వసతికి నిరంతర డిమాండ్ ఉన్నందున, వైద్య చికిత్స, పర్యాటకం, విద్య, పారిశ్రామిక ఉపాధి కోసం వచ్చే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని డీఆర్‌ఎం లలిత్ బోహ్రా గురువారం తెలిపారు.