విశాఖ కలెక్టరేట్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్వతీపురం జిల్లా పెదపెంకిలో రోడ్ల అభివృద్ధి జరగలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల లేమి విషయాన్ని అధికారులు తెలియజేయలేదని, కేవలం కాఫీ తాగి చప్పట్లు కొట్టుకోవడానికి సమీక్షలు నిర్వహించడం లేదని, పనులు చేయకపోవడంతో గ్రామీణ ప్రజలు అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆయన అన్నారు.