విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బుధవారం 96వ వార్డు పరిధిలో రూ. 3. 53 కోట్ల వ్యయంతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, స్పోర్ట్స్ థీమ్ పార్క్ మౌలిక వసతుల కల్పనకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యం, ఆహ్లాదమే లక్ష్యంగా పనిచేస్తుందని మేయర్ తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు.