విశాఖలో భారీ వర్షం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విశాఖలో ఆదివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఆదివారం సోమవారం ఉత్తరాంధ్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖలోని వాతావరణ కేంద్రం ఇప్పటికే తెలియజేసింది. అనకాపల్లి, అల్లూరు జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. విస్తృతంగా ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్