రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

విశాఖలో బుధవారం రాత్రి పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనకాపల్లికి చెందిన పి.రమేశ్ (45) మృతి చెందారు. ఆయన తన అత్త దేవితో కలిసి ద్విచక్ర వాహనంపై గాజువాక నుంచి అనకాపల్లి వస్తుండగా, లంకెలపాలెం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రమేశ్ అక్కడికక్కడే మరణించగా, దేవి గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్