విశాఖలో 'మార్నింగ్ న్యూట్రిషన్' ప్రారంభం

విశాఖ జిల్లాలో 'మార్నింగ్ న్యూట్రిషన్' కార్యక్రమం సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభమైంది. మధ్యాహ్న భోజన పథకానికి అనుబంధంగా, వారంలో మూడు రోజులు ఉదయం పూట విద్యార్థులకు బలవర్థక అల్పాహారం అందించనున్నారు. ఉదయాన్నే అల్పాహారం తీసుకోకుండా తరగతులకు వచ్చే విద్యార్థులను గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్