పీఎన్‌జీ కనెక్షన్లు ఇస్తున్నారోచ్‌

యుద్ధం కారణంగా ఎల్‌పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో, ప్రభుత్వం విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాలకు పైపుల ద్వారా సహజ వాయువు (పీఎన్‌జీ) సరఫరా చేయాలని నిర్ణయించింది. కాకినాడ నుంచి శ్రీకాకుళం వరకు పైపులైన్ నిర్మాణం 2014లో ప్రారంభమైనా, నిధుల సమస్యతో నిలిచిపోయింది. గాజువాక వరకు ప్రధాన పైపులైన్లు పూర్తయ్యాయి. ఎల్‌పీజీతో పోలిస్తే పీఎన్‌జీ ఖరీదు తక్కువ, సరఫరా సులువు. ప్రస్తుతం ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.960 కాగా, పీఎన్‌జీ కిలో రూ.45కే లభించనుంది. మీటర్ ద్వారా వినియోగాన్ని నమోదు చేసి, రెండు నెలలకు ఒకసారి బిల్లింగ్ చేస్తారు. ఇది సురక్షితమైనది కూడా.

సంబంధిత పోస్ట్