టీవీ సీరియల్‌లో అవకాశం ఇప్పిస్తానని నమ్మించి, తెలంగాణకు చెందిన ఓ మహిళను విశాఖకు చెందిన లక్ష్మీ వరప్రసాద్ మోసం చేశాడు. నటనపై ఆసక్తిని ఆసరాగా చేసుకుని విడతల వారీగా రూ.60 లక్షలకు పైగా వసూలు చేశాడు. బాధితురాలి బ్యాంక్ ఖాతా నుంచి రూ.22.43 లక్షలతో లగ్జరీ కారు కూడా కొనుగోలు చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో TG పోలీసులు కార్ల షోరూం ఖాతాను ఫ్రీజ్ చేశారు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.