ఉత్తరాంధ్రలో గూగుల్ డేటా సెంటర్ సహా పలు ఐటీ కంపెనీల ఏర్పాటుకు కృషి చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ విశాఖ బీచ్ రోడ్డులో అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. వీఎంఆర్డీఏ చైర్మన్ ఎం. వి. ప్రణవ్ గోపాల్, టీడీపీ నేత చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో కళాకారుడు బాలాజీ వరప్రసాద్ దీనిని తీర్చిదిద్దారు. 'జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్'గా లోకేష్‌ను కొనియాడుతూ ఏర్పాటు చేసిన ఈ శిల్పాన్ని పర్యాటకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. విశాఖ త్వరలోనే ఏఐ (AI) హబ్‌గా మారుతుందని, గూగుల్ రాకతో వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.