సింహాచలం గిరి ప్రదక్షిణకు బుధవారం భారీగా భక్తులు రావడంతో వేపగుంట నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోయింది. అరకు రోడ్, సబ్బవరం రోడ్, విశాఖ రోడ్, సింహాచలం రోడ్‌లపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనూహ్యంగా భక్తుల సంఖ్య పెరగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.