విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్టార్-8 క్వార్టర్స్‌లోని ఓ ప్లాట్ బాత్‌రూమ్‌లో కమోడ్‌లోంచి శబ్దాలు రావడంతో, నివాసితులు భయపడ్డారు. పాము అని భావించి స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్, అది పాము కాదని, ఉడుము అని గుర్తించి, చాకచక్యంగా పట్టుకొని సురక్షితంగా దూరంగా విడిచిపెట్టాడు. ఈ సంఘటనతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో కలకలం రేగింది.