విశాఖలో ఏప్రిల్ 12 నుంచి రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు

విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియంలో ఏప్రిల్ 12 నుంచి 16 వరకు 'కీ॥శే॥ పైడా కౌషిక్ రాష్ట్రస్థాయి ఆహ్వాన సాంఘిక నాటికల పోటీలు' నిర్వహించనున్నట్లు నాటకోత్సవాల అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన 38 ఎంట్రీలలో అత్యుత్తమమైన 9 నాటికలను ప్రదర్శనకు ఎంపిక చేశారు. విజేతలకు భారీ నగదు బహుమతులతో పాటు, పాల్గొనే కళాకారులకు పారితోషికాలు, వసతి కల్పిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి డా. జి. ఆర్. కె. ప్రసాద్ (రాంబాబు) వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్