మధురవాడలో వ్యక్తి అనుమానాస్పద మృతి

పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని శివశక్తి నగర్‌లో బుధవారం నాగదేవత గుడి సమీపంలో ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు అప్పుఘర్ సెక్టార్-9కు చెందిన బిలసోంతి ఉమాశంకర్ (51) అని పోలీసులు గుర్తించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్