వాల్తేరు రైల్వే డివిజన్ కనుమరుగవుతోంది. 1888లో బెంగాల్, నాగపూర్ రైల్వే జోన్‌ల ప్రారంభంతో రూపుదిద్దుకున్న ఈ డివిజన్, 1893లో తొలి రైళ్లు నడిపింది. దేశంలో అత్యధిక ఆదాయం అందించే డివిజన్లలో ఒకటిగా పేరు గాంచిన వాల్తేరు, AP, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు కీలక సేవలు అందించింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా దీనిని విభజించి విశాఖ,రాయగడ డివిజన్లుగా మార్చుతున్నారు. దీంతో 133 ఏళ్ల ‘వాల్తేరు’ పేరు చరిత్రలో కలిసిపోనుంది.