విశాఖపట్నంలోని రుషికొండ IT హిల్-3లో 2011లో కార్యకలాపాలు ప్రారంభించిన IBM, కేటాయించిన 25 ఎకరాల్లో ఎక్కువ భాగాన్ని అవసరం లేదని వెనక్కి ఇచ్చింది. హుద్‌హుద్ తుఫాన్‌తో భవనం దెబ్బతినడంతో, మిగిలిన 3.2 ఎకరాలను ఇన్ఫినిటీ సంస్థకు విక్రయించి విశాఖలో సెంటర్‌ను మూసివేసింది. ప్రభుత్వ ఆహ్వానంతో మళ్లీ కార్యాలయం ఏర్పాటు దిశగా చర్చలు ప్రారంభించినప్పటికీ, గతంలో వెనక్కి ఇచ్చిన భూమిని ప్రభుత్వం ఇప్పటికే TCSకు కేటాయించింది.