గంజాయి రవాణా ముగ్గురు అరెస్ట్

కంచరపాలెం పోలీసులు బుధవారం గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. జ్ఞానాపురం రైల్వేస్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని తనిఖీ చేయగా, 4.6 కేజీల గంజాయి లభ్యమైంది. అరకు ప్రాంతం నుంచి కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొవ్వూరుకు చెందిన తేజ, వంశీకృష్ణలతో పాటు పల్నాడు(D)కు చెందిన పాపిరెడ్డిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్