విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో కేంద్ర మంత్రి సురేష్ గోపి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అమ్మవారి హోమంలో పాల్గొని, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన ఆయన, తెలుగు ప్రజలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అనంతరం 'అల వైకుంఠపురములో' సినిమాలోని పాట పాడి ప్రేక్షకులను అలరించారు.