విశాఖలో కేంద్ర మంత్రి సోనోవాల్.. అప్పన్న ప్రసాదం అందజేత

విశాఖ నగరానికి కేంద్ర పోర్టులు వాటర్ వేస్ శాఖ మంత్రి సర్భానంద్ సోనోవాల్ సోమవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ సలహా మండలి కమిటీ మాజీ సభ్యులు, నావెల్ డాక్ యార్డ్ కేటిబి అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకొని ఘనంగా సత్కరించారు. అనంతరం సింహాద్రి నాథుడు చందన ప్రసాదం అందజేశారు. అలాగే సింహాచలం ఆలయ విశిష్టతను కేంద్ర మంత్రి కి శ్రీనుబాబు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్