పత్రికా స్వేచ్ఛ ముసుగులో వైసీపీ మహిళా నేతలపై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాధాకృష్ణ భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, దీనిపై సీఎం, డిప్యూటీ సీఎంలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తక్షణమే రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రజ్యోతి కార్యాలయాల ముందు నిరసనలు చేపడతామని హెచ్చరించారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, కేవలం అవినీతికే వ్యతిరేకమని, 'మావిగన్' అభివృద్ధి చెందాలన్నదే జగన్ ఆకాంక్ష అని బొత్స స్పష్టం చేశారు.