ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై విశాఖ పంచాయతీ రాజ్ శాఖ రిటైర్డ్ ఎస్‌ఈ కె.శ్రీనివాసరావు నివాసాల్లో ACB అధికారులు గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. మధురవాడ, సాలూరు, హైదరాబాద్‌లోని ఆయన నివాసాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, ఆస్తుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.