విశాఖ: ప్రశాంతంగా ఏపీసెట్.. తొలిరోజు 81. 38 శాతం హాజరు

రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష 'ఏపీసెట్-2025' శనివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలిరోజు 10 సబ్జెక్టులకు జరిగిన పరీక్షకు 9,359 మంది అభ్యర్థులకు గాను 7,617 మంది (81.38%) హాజరయ్యారు. ఏయూ వీసీ ఆచార్య జి. పి. రాజశేఖర్ సెట్ కోడ్‌ను విడుదల చేయగా, రెక్టార్ ఆచార్య పి. కింగ్, మెంబర్ సెక్రటరీ ఆచార్య జి. ఎం. జె. రాజు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఆదివారం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేయడంతో అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్